సెమీస్లో భారత్-శ్రీలంక అమీతుమీ | India to face Sri Lanka in U-19 World Cup semis | Sakshi
Sakshi News home page

సెమీస్లో భారత్-శ్రీలంక అమీతుమీ

Feb 7 2016 6:31 PM | Updated on Nov 9 2018 6:43 PM

సెమీస్లో భారత్-శ్రీలంక అమీతుమీ - Sakshi

సెమీస్లో భారత్-శ్రీలంక అమీతుమీ

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా తొలి సెమీ ఫైనల్లో భారత్తో తలపడేందుకు శ్రీలంక సన్నద్దమైంది.

మిర్పూర్:అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా తొలి సెమీ ఫైనల్లో భారత్తో తలపడేందుకు శ్రీలంక సన్నద్దమైంది. ఈ రెండు జట్లు మంగళవారం జరిగే  సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 35.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

 

స్వల్ప పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు శుభారంభం లభించింది. శ్రీలంక ఓపెనర్లలో అవిష్కా ఫెర్నాండో (95) ఆకట్టుకోగా, బర్నాడా(22) ఫర్వాలేదనిపించాడు.దీంతో శ్రీలంక తొలి వికెట్ కు 76 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అనంతరం కిమిందు ఫెర్నాండో(10) నిరాశపరచగా, ఆశాలంకా(34) మోస్తరుగా రాణించి జట్టును విజయం దిశగా నడిపించాడు.అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 184 పరుగులకే పరిమితమైంది.

Advertisement
 
Advertisement
Advertisement