కౌంటీ క్రికెట్‌లో అశ్విన్‌ | England, Ashwin set for his maiden county stint | Sakshi
Sakshi News home page

కౌంటీ క్రికెట్‌లో అశ్విన్‌

Aug 15 2017 12:45 AM | Updated on Jul 10 2019 7:55 PM

కౌంటీ క్రికెట్‌లో అశ్విన్‌ - Sakshi

కౌంటీ క్రికెట్‌లో అశ్విన్‌

భారత క్రికెట్‌ జట్టు అగ్రశ్రేణి ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌

పల్లెకెలె: భారత క్రికెట్‌ జట్టు అగ్రశ్రేణి ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఆడనున్నాడు. అతను వొర్సెస్టర్‌షైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ‘శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ముగియడంతో చతేశ్వర్‌ పుజారా కౌంటీల్లో నాటింగ్‌హమ్‌షైర్‌ జట్టు తరఫున మళ్లీ ఆడేందుకు వెళ్లనున్నాడు.

అశ్విన్‌కు కూడా మేము అనుమతి ఇచ్చాం. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. కౌంటీల్లో ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులపై వీరిద్దరికీ అవగాహన ఏర్పడుతుంది’ అని బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement