ఘోర ప్రమాదం.. అథ్లెట్ల దుర్మరణం | 4 Powerlifters Killed In Accident In Delhi | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు అథ్లెట్ల మృతి

Jan 7 2018 10:00 AM | Updated on Sep 28 2018 3:39 PM

4 Powerlifters Killed In Accident In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు నలుగురు అథ్లెట్ల ప్రాణాలను బలితీసుకుంది. ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారి పరిస్థితి కూడా విషయంగానే ఉన్నట్లు తెలిసింది. 

ఆరుమంది అథ్లెట్లు.. స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో ఉదయం ఢిల్లీ నుంచి పానిపట్‌కు బయల్దేరారు. రోడ్డు మీద పొగమంచు విపరీతంగా ఉండడంతో.. ఎదురుగా ఉన్నవేవీ కనిపించలేదు. మంచి వేగంతో వెళుతున్న కారు సింధు ప్రాంతంలో ప్రమాదానికి గురయింది. కారులో ప్రయాణిస్తున్న పవర్‌ లిఫ్టర్లు తికమ్‌ చంద్‌, సౌరభ్‌, యోగేష్‌, హరీష్‌ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రపంచ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ సాక్ష్యం యాదవ్‌,  మరో క్రీడాకారుడు బాలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఢిల్లీలోని మ్యాక్స్‌ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement