పవన్‌ కల్యాణ్‌ ఎక్కడున్నారు? | YSRCP MP Mekapati Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ ఎక్కడున్నారు?

Mar 14 2018 11:55 AM | Updated on Mar 23 2019 9:10 PM

YSRCP MP Mekapati Comments On Chandrababu - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ: అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నాడని వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని, బాబుకు రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంతసేపు రాజకీయ తాపత్రయమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నడూ ఆలోచించలేదని అన్నారు. మొదటి నుంచి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నది వైఎస్‌ఆర్‌సీపీనే అని, హోదాపై అనేక మార్లు మాట మార్చిన చరిత్ర చంద్రబాబుదే అన్నారు.  పార్లమెంట్‌ వేదికగా ప్రత్యేకహోదాపై ఎందుకు పోరాడలేకపోయారని మేకపాటి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని, తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement