బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!: అనంత | YSRCP MLA Anantha Venkatarami Reddy Slams On TDP, Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!: అనంత

Feb 22 2020 3:05 PM | Updated on Feb 22 2020 5:46 PM

YSRCP MLA Anantha Venkatarami Reddy Slams On TDP, Chandrababu Naidu - Sakshi

సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై విచారణ అంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో జరిగిన ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్‌ ఏర్పాటును మేము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతల భూ లావాదేవిలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఈఎస్‌ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఒకే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇక అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా చంద్రబాబు, లోకేష్‌లు మారారని విమర్శించారు. కులాలు, మతాల ప్రాతిపదికన అవినీతి పరులను ఊపేక్షించాలా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement