‘కోడెల అంత అవినీతి ఏ స్పీకర్‌ చేయలేదు’ | YSRCP Leader Ambati Rambabu Fires On Speaker Kodela Sivaprasad | Sakshi
Sakshi News home page

‘కోడెల అంత అవినీతి ఏ స్పీకర్‌ చేయలేదు’

Feb 4 2019 10:21 PM | Updated on Jul 29 2019 2:44 PM

YSRCP Leader Ambati Rambabu Fires On Speaker Kodela Sivaprasad - Sakshi

సాక్షి, గుంటూరు : రాజకీయ చరిత్రలో ఏ స్పీకర్‌ కూడా చేయలేని అవినీతిని ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కోడెల వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. గతంలో కోడెల ఆస్పత్రిలో బాంబు పేలి జనం చనిపోతే.. ఆ కేసును బీజేపీ నేత ఆద్వానీని అడ్డం పెట్టుకొని మాఫీ చేయించుకున్న ఘనుడు కోడెల అని విమర్శించారు. ఇసుక, రేషన్‌, ఆర్టీసీ.. ఇలా అన్నింటిలోనూ కోడెల కుమారుడు, కుమార్తె అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

కోడెల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం : గోపిరెడ్డి
అసెంబ్లీ సిగ్గుపడేలా స్పీకర్‌ కోడెల వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి తోలి శాసన సభకు స్పీకర్‌ గా ఉండటం అసెంబ్లీకే సిగ్గుచేటన్నారు. అన్నాక్యాంటిన్‌లోనూ కోడెల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.కోడెల అవినీతిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని చెప్పారు. దమ్ముంటే కోడెల శివప్రసాద్‌ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. 

Advertisement
 
Advertisement
Advertisement