‘కేసీఆర్‌ వల్లే వారికి కరోనా సోకింది’ | TRS‌ Government Has Not Built A Single Project: Bandi Sanjay | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌కు ఆ భయం పట్టుకుంది’

Jul 10 2020 8:47 PM | Updated on Jul 10 2020 9:14 PM

TRS‌ Government Has Not Built A Single Project: Bandi Sanjay  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులు ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కట్టలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు మంచి చేయడం కంటే ఆయన తొట్టి గ్యాంగ్‌ మంత్రులకు మంచి చేసేందుకే ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ నేతలు పగటి వేళగాళ్ల లాగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని, తన అవినీతి బయట పెట్టి జైలుకు పంపిస్తారేమో అన్న భయం పట్టుకుందని విమర్శించారు. (‘సీఎం కేసీఆర్‌ కరోనా తెచ్చుకోరు.. తెప్పిస్తారు’)

కేసీఆర్‌ అవినీతి లెక్కలు తేల్చి అతన్ని జైలుకు పంపే వరకు బీజేపీ నేతలు, కార్యకర్తలు నిద్రపోరని బండి సంజయ్‌ మండిపడ్డారు. తన వల్ల ఎవరికి కరోనా రాలేదని, కేసీఆర్ వల్లనే ఆధికారులకు.. ప్రగతి భవన్ సిబ్బందికి కరోనా సోకిందని అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ సచివాలయం కూల్చివేత కార్యక్రమం పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మ పరిరక్షణ కోసం కచ్చితంగా రాజకీయాలు చేస్తామని అన్నారు. మత రాజకీయాలు చేసేది బీజేపీ కాదని, కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ చేస్తోందని దుయ్యబట్టారు. పేద ప్రజలు,  కులవృత్తులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. ఉగ్రవాదులకు వత్తాసు పలికే పార్టీకి తొత్తులుగా పని చేసే వారిని నమ్ముతారా, లేక తమ కోసం పనిచేసే వారిని నమ్ముతారో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని సంజయ్‌ సూచించారు. (కేసీఆర్‌ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్న్‌)

Advertisement
 
Advertisement
Advertisement