‘ప్రధానికి కేసీఆర్‌ దాసోహమయ్యారు’ | mla revanth reddy fires on cm chandrashekar rao | Sakshi
Sakshi News home page

‘ప్రధానికి కేసీఆర్‌ దాసోహమయ్యారు’

Feb 9 2018 5:34 PM | Updated on Mar 18 2019 9:02 PM

mla revanth reddy fires on cm chandrashekar rao - Sakshi

రేవంత్‌రెడ్డి

సాక్షి, కామారెడ్డి: కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై తనదైనరీతిలో విరుచుకుపడ్డారు. మోదీకి కేసీఆర్ దాసోహమయ్యారని, అందుకే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు లేకున్నా నోరు మెదపడం లేదని ఆరోపించారు.

2019 ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి  వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమన్నారు. కేసీఆర్ దేశం విడిచి పారిపోకుండా తన పాస్‌పోర్టును డీజీపీకి అప్పగించాలని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement