దమ్ముంటే మోదీని ప్రశ్నించగలవా? | Anantha Venkatram Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

దమ్ముంటే మోదీని ప్రశ్నించగలవా?

May 6 2020 12:16 PM | Updated on May 6 2020 12:16 PM

Anantha Venkatram Reddy Slams Chandrababu Naidu - Sakshi

మున్సిపల్‌ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అనంత

అనంతపురం సెంట్రల్‌: దమ్ముంటే ప్రధాని మోదీని ప్రశ్నించగలవా? అని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  సవాల్‌ విసిరారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో చాలా రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరిచాయని, కానీ ఏపీలో మాత్రమే చంద్రబాబు, టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం నగరంలోని 50వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ గురు బిందుప్రియ, శేఖర్‌బాబు ఆధ్వర్యంలో డివిజన్‌ పరిధిలోని మున్సిపల్‌ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

ఎమ్మెల్యే అనంత హాజరై పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. లాక్‌డౌన్‌తో పనులు లేకపోవడంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ అందించిందని, దాతలు కూడా మందుకొచ్చి చేయూతనిస్తున్నారన్నారు. ఎన్ని మంచి పనులు చేస్తున్నా చంద్రబాబు, టీడీపీ నాయకులు ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రతి వీధిలో బెల్ట్‌ షాపులు ఉండేవని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement