విడాకులు తీసుకున్న సీరియ‌ల్ న‌టి | Yeh Rishta Kya Kehlata Hai Star Simran Khanna Got Divorced | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకున్న సీరియ‌ల్ న‌టి

Apr 13 2020 7:22 PM | Updated on Apr 13 2020 7:31 PM

Yeh Rishta Kya Kehlata Hai Star Simran Khanna Got Divorced - Sakshi

సాక్షి, ఢిల్లీ : స్టార్‌ప్ల‌స్ ఛానెల్‌లో సూప‌ర్‌హిట్ అయిన యే రిష్‌తా క్యా కెహ్లాతా హై సీరియ‌ల్‌లో గాయ‌త్రి గోయెంకా పాత్ర పోషించిన న‌టి సిమ్రాన్ ఖ‌న్నా భ‌ర్త  భ‌ర‌త్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ మేర‌కు అధికారికంగా దృవీక‌రించారు. స్నేహ‌పూర్వ‌కంగానే విడిపోతున్నామ‌ని, ఇద్ద‌రి మ‌ధ్యా ఎలాంటి శ‌త్రుత్వం లేద‌ని చెప్పారు. త‌న కుమారుడు వినీత్ క‌స్ట‌డీ మాత్రం భ‌ర్త‌కే ఇచ్చిన‌ట్లు తెలిపిన సిమ్రాన్‌..త‌రుచుగా కొడుకుని మాత్రం క‌లుస్తాను అని చెప్పింది. 


 "అవును, నేను భ‌ర‌త్ విడాకులు తీసుకున్నాం. అయినంత‌మాత్రాన మా మ‌ధ్య ద్వేషం, శ‌త్రుత్వం లేదు. ఇద్ద‌రి అభిప్రాయంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. మా ఇద్ద‌రి మార్గాలు వేరు. అలానే విడిపోయాం. నా కొడుకు క‌స్ట‌డీ మాత్రం భ‌ర‌త్‌కే అప్ప‌జెప్పాను అంటూ పేర్కొంది" యే రిష్‌తా క్యా కెహ్లాతా హై సీరియ‌ల్‌లో గాయ‌త్రి పాత్ర‌లో అల‌రించిన సిమ్రాన్.. కిస్ దేశ్ మెయి హై మేరా దిల్మా, మాతా కి చౌకి వంటి  ప‌లు టీవీ షోల‌లో కూడా న‌టించి మెప్పించింది.


 

Advertisement
 
Advertisement
Advertisement