కొత్త ప్రయాణం | Samantha Speaks About Her New Journey In Lockdown | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయాణం

Jun 24 2020 1:13 AM | Updated on Jun 24 2020 1:13 AM

Samantha Speaks About Her New Journey In Lockdown - Sakshi

లాక్‌డౌన్‌ సినిమా స్టార్స్‌ అందరినీ ఇళ్లల్లో లాక్‌ చేసేసింది. ఈ ఖాళీ సమయాన్ని కొందరు తారలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. సమంత అయితే టెర్రస్‌ గార్డెనింగ్‌ మొదలుపెట్టారు. ‘క్యాబేజ్‌ మైక్రోగ్రీన్స్‌’ని పండించారు. మైక్రోగ్రీన్స్‌ అంటే సూక్ష్మ మొక్కలు అని అర్థం. వాటిని ఎలా పండించాలో కూడా సోషల్‌ మీడియా ద్వారా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఓ 48 రోజులపాటు ఈషా క్రియ (యోగా) ప్రయాణం మొదలుపెట్టానని తెలిపారు. ఈషా యోగా గురించి సమంత ఇంకా మాట్లాడుతూ– ‘‘ఈ క్రియ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఆరోగ్యవృద్ధికి తోడ్పడుతుంది. మనిషి శ్రేయస్సుకు అవసరమైన శారరీక బలంతో పాటు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనే మానసిక ధైర్యం కూడా వస్తుంది. మానసికంగా, శారీరకంగా «ధృడంగా తయారవ్వొచ్చు’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement