అక్కడ అందరూ అజ్ఞాతవాసులే.. రేణు దేశాయ్‌ | Renu Desai Deleted Her Twitter account | Sakshi
Sakshi News home page

అక్కడ అందరూ అజ్ఞాతవాసులే.. రేణు దేశాయ్‌

Jun 26 2018 3:55 PM | Updated on Mar 28 2019 6:14 PM

Renu Desai Deleted Her Twitter account - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్‌ ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులందరికీ అందుబాటులో ఉంటారు. అయితే రేణు ఇకపై తన ట్విటర్‌కి టాటా చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నుంచి వస్తున్న నెగటీవ్ కామెంట్ల వలనే ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎందుకు వైదొలుగుతున్నారో అన్నది తన ట్విటర్‌లో పేర్కొన్నారు.

రేణు దేశాయ్‌ ‘ట్విటర్‌ నిండా విపరీతమైన ప్రతికూలత ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వ్యక్తులు అధికంగా అజ్ఞాత వాసులు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా చిరాకు కూడిన వాళ్లు. ఒక సినిమా గురించి కానీ రాజకీయ వ్యక్తుల గురించి కానీ నెగెటివ్‌గా రాయడానికే ఇష్టపడతారు. ఇప్పుడు నేను నూతన జీవితం ప్రారంభిస్తున్నాను. ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నేనే నా ట్విటర్‌ నుంచి వైదొలగి ఈ నెగెటివిటికి దూరంగా ఉండదలుచుకుంటున్నాను. అదే సమయంలో నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని ప్రతికూల పరిస్థితిలో నాకు తోడుగా వెంట ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఆ మధ్య రెండో వివాహం గురించి మాట్లాడిన రేణూ.. తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపిన విషయం తెలిసిందే. అయితే తన జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత లేదు. దీనికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు కూడా తెలిపారు. రేణు ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


Advertisement
 
Advertisement
Advertisement