ప్రభాస్‌ 20 మూవీ ఫోటోలు వైరల్‌ | Prabhas Pooja Hegde Movie Launching Photos Viral | Sakshi
Sakshi News home page

ప్రభాస్ సినిమా ముహూర్తం ఫోటోలు వైరల్‌

May 8 2020 4:52 PM | Updated on May 8 2020 6:29 PM

Prabhas Pooja Hegde Movie Launching Photos Viral - Sakshi

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన 20 చిత్రాన్ని జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ లవ్‌ స్టోరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మూవీలో డార్లిం​​​గ్‌కు జోడిగా తొలిసారి పూజా హెగ్డె జత కట్టనున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. చివరి షెడ్యూల్‌ జార్జియాలో జరిగింది. తాజాగా సినిమాకు చెందిన ముహుర్తం ఫోటోలను దర్శకుడు రాధాకృష్ణ తన ట్విటర్‌లో రిలీజ్‌ చేశారు. (పెళ్లిపై స్పందించిన సల్మాన్‌ ప్రియురాలు! )

పూజా కార్యక్రమానికి ప్రభాస్‌, కృష్ణం రాజు, ఎస్‌ఎస్‌ రాజమౌళి, వివి వినాయక్‌, పూజాహెగ్డె, కోన వెంకట్‌, నిర్మాతలు వంశీ, ప్రమోద్య హజరైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు పేరును మాత్రం ఖరారు చేయలేదు. ‘ఓ డియ‌’ర్ అనే టైటిల్‌ని చిత్ర యూనిట్‌ ప‌రిశీలిస్తోంది. ఇక మూవీ లాంచింగ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా ప్ర‌భాస్ త‌న 21వ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. (మరింత సక్సెస్‌పుల్‌గా టెలి మెడిసిన్..)
ప్రభాస్‌ చిత్రంలో స్టైలిష్‌‌ విలన్‌?

Advertisement
 
Advertisement
Advertisement