తనలాగా ఉన్న 8మందితో పరీక్షలు | MP Bubly hires 8 students to sit for her in BA exams | Sakshi
Sakshi News home page

తనలాగా ఉన్న 8మందితో పరీక్షలు

Oct 22 2019 4:09 AM | Updated on Oct 22 2019 4:52 AM

MP Bubly hires 8 students to sit for her in BA exams - Sakshi

బంగ్లాదేశ్‌ మహిళా ఎంపీ తమన్నా నుస్రత్‌

ఢాకా: బంగ్లాదేశ్‌ అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఒకరు వర్సిటీ పరీక్షలను తన పోలికలతో ఉన్న 8మంది మహిళలతో రాయించారు. ఈ విషయం మీడియా బయటపెట్టడంతో ఆమెను వర్సిటీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్‌ పార్టీకి చెందిన ఎంపీ తమన్నా నుస్రత్‌ బంగ్లాదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నారు. ఇందులో భాగంగా 13 సబ్జెకుల పరీక్షలు రాసేందుకు తన మాదిరిగానే ఉన్న 8 మంది మహిళలను వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని నాగరిక్‌ టీవీ అనే చానెల్‌ బయట పెట్టింది. పరీక్షలు రాస్తున్న సమయంలో వారికి ఎంపీ అనుచరులు కాపలాగా ఉన్నారని తెలిపింది. స్పందించిన వర్సిటీ అధికారులు ఎంపీ నుస్రత్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement