రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం | 14 killed, dozens injured in Nepal bus accident | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం, 14మంది మృతి

Dec 15 2019 2:31 PM | Updated on Dec 15 2019 3:11 PM

14 killed, dozens injured in Nepal bus accident - Sakshi

న్యూఢిల్లీ: నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సింధుపాల్‌చౌక్‌ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో బస్సు కలిన్‌చౌక్‌ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 40మంది ఉన్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement