breaking news
Sindhupalchowk
-
నేపాల్‌లో బస్సు ప్రమాదం 14మంది మృతి
-
రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం
న్యూఢిల్లీ: నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సింధుపాల్‌చౌక్ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో బస్సు కలిన్‌చౌక్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 40మంది ఉన్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
కొండచరియలు విరిగి 200 ఇళ్లు నేలమట్టం!
నేపాల్: సింధుపల్‌చౌక్ జిల్లా మన్ఖా గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 200 ఇళ్లు నేలమట్టం కాగా, 200 మంది ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది. ఖాట్మండ్ రాజధానికి 75 కిలోమీటర్ల దూరంలోని సింధుపల్ చౌక్ లోని మంఖా గ్రామంలో చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగి పడటంతో ఒకే రాత్రిలో కొండ మాయమైందని స్థానికులు తెలిపారు. విరిగిపడ్డ కొండ చరియలతో ఆగిన సుంఖోషి నది ప్రవాహం ఆగిపోయినట్టు సమాచారం. కొండ చరియలు విరిగిపడటంతో నది.. సరస్సు మాదిరిగా మారింది. ప్రవాహం పెరిగిన కారణంగా ఏ క్షణంలోనైనా నది అడ్డుగా పడివున్న కొండచరియలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.