నేడు నగరానికి షర్మిల | Today the city Sharmila | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి షర్మిల

Aug 5 2013 12:48 AM | Updated on May 25 2018 9:10 PM

నేడు నగరానికి షర్మిల - Sakshi

నేడు నగరానికి షర్మిల

అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కును నిరసిస్తూ.. తొమ్మిది నెలల పాటు పద్నాలుగు జిల్లాల మీదుగా 3112 కి.మీ. మేర సాగిన పాదయాత్రను ఆదివారం సాయంత్రం ఇచ్ఛాపురంలో ముగించిన జగనన్న సోదరి వైఎస్ షర్మిల..

సాక్షి, సిటీబ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కును నిరసిస్తూ.. తొమ్మిది నెలల పాటు పద్నాలుగు జిల్లాల మీదుగా 3112 కి.మీ. మేర సాగిన పాదయాత్రను ఆదివారం సాయంత్రం ఇచ్ఛాపురంలో ముగించిన జగనన్న సోదరి వైఎస్ షర్మిల.. సోమవారం ఉదయం నగరానికి చేరుకోనున్నారు. ఆమె ఉదయం పది గంటలకు విశాఖపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుని తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు, కష్టాలను ఆమె నేరుగా జగన్‌మోహన్‌రెడ్డికి వివరించనున్నారు. 
 భారీ స్వాగత సన్నాహం
 
 ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కి.మీ.ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌బాగ్, ఒవైసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ నగర పార్టీ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, యువజన విభాగం అధ్యక్షులు పుత్తా ప్రతాప్‌రెడ్డిలు తెలిపారు. 
 తరలిరండి: జనార్దన్‌రెడ్డి
 
 సోమవారం నగరానికి చేరుకోనున్న షర్మిలకు దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అత్తాపూర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విమానాశ్రయం నుంచి చంచల్‌గూడ జైలు వరకు షర్మిలకు అడుగడుగునా స్వాగ తం పలికే కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement