బకెట్‌లో పడి చిన్నారి మృతి | Baby Drowns in Bucket, dies in guntur district | Sakshi
Sakshi News home page

బకెట్‌లో పడి చిన్నారి మృతి

Oct 10 2015 10:40 AM | Updated on Aug 24 2018 2:36 PM

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ బకెట్‌లో పడి మృతి చెందింది.

దుగ్గిరాల: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ బకెట్‌లో పడి మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపుడి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన దాసరి మహేష్, రోజా కుమారి దంపతులు వ్యవసాయ కూలీలు. ఈ క్రమంలో తమ రెండేళ్ల చిన్నారి పార్వతిని అమ్మమ్మ వద్ద వదిలి వాళ్లు పనికి వెళ్లారు. ఆమ్మమ్మ ఇంట్లో పనిచేసుకుంటూ ఉండగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు బకెట్‌లో పడింది. అది గుర్తించేలోపల చిన్నారి మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement