సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, సీనియర్ నేత జక్కంపూడి రామ్మోహన్‌రావుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జక్కంపూడి రామ్మోహన్‌రావు ప్రజల కోసం ఎన్నో సేవలు అందించిన నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో చొరవ చూపారని గుర్తు చేశారు. వైఎస్సార్ కుటుంబంతో జక్కంపూడి రామ్మోహన్‌రావుకు సుదీర్ఘ అనుబంధం ఉందని జగన్ పేర్కొన్నారు.

ప్రజలతో మమేకమై పనిచేసిన నేతగా, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రజల పట్ల జక్కంపూడి చూపిన అంకితభావం, చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైఎస్ జగన్ అన్నారు.


