తొలి నుంచీ ఆధిక్యం.... | TRS leads in Warangal elections counting | Sakshi
Sakshi News home page

తొలి నుంచీ ఆధిక్యం....

Nov 24 2015 9:44 AM | Updated on Mar 29 2019 9:31 PM

తొలి నుంచీ ఆధిక్యం.... - Sakshi

తొలి నుంచీ ఆధిక్యం....

వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ ....తొలి రౌండ్ నుంచి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ ....తొలి రౌండ్ నుంచి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. అయిదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ లక్షకు పైగా మెజార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నాయి.

 

టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుంటే... కాంగ్రెస్ 30వేలు, బీజేపీ 29 వేలు ఓట్లు దక్కించుకున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. విపక్షాల ఓట్ల కంటే రెట్టింపు సంఖ్యలో టీఆర్ఎస్ కు ఓట్లు వచ్చాయి. మరోవైపు నోటాకు 1122 ఓట్లు నమోదు అయ్యాయి.

ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి...

టీఆర్ఎస్-పసునూరి దయాకర్-    122157
కాంగ్రెస్-సర్వే సత్యనారాయణ-15853
బీజేపీ- దేవయ్య-12739
వైఎస్ఆర్ సీపీ- నల్లా సూర్యప్రకాశ్-2155

Advertisement
 
Advertisement
Advertisement