శ్రీవారి దర్శనానికి 15 గంటలు | tirumala information | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Aug 31 2015 1:09 AM | Updated on Sep 3 2017 8:25 AM

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 60 వేల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 15 గంటలు, 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించే అవకాశం ఉందని ఆలయాధికారులు తెలిపారు. గదుల కోసం భక్తులు రిసెప్షన్ కార్యాలయాల వద్ద వేచి ఉన్నారు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించుకునేందుకు నిరీక్షించారు. హుండీ కానుకలు రూ. 2.07 కోట్లు లభించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement