పార్కింగ్‌ స్థల పరిశీలన | searching for parking places | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ స్థల పరిశీలన

Aug 2 2016 10:59 PM | Updated on Sep 4 2017 7:30 AM

పార్కింగ్‌ స్థల పరిశీలన

పార్కింగ్‌ స్థల పరిశీలన

కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు మండల పరిధిలోని వింజమూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్‌ స్థలాన్ని మంగళవారం ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్‌ పరిశీలించారు.

 చింతపల్లి :  కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు మండల పరిధిలోని వింజమూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్‌ స్థలాన్ని మంగళవారం ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్‌ పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  నాగార్జునసాగర్, అజ్మాపురం, పెద్దమునిగల్, కాచరాజుపల్లి పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువైతే హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను వింజమూరు వద్ద నిలిపివేసేందుకు సుమారు 70 ఎకరాల స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  పార్కింగ్‌ వద్ద భక్తుల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లు, రోడ్డు, విద్యుత్,తాగునీటి వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ ఏఈ జీవన్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐ మల్లారెడ్డి, వీఆర్వోలు మల్లయ్య, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement