'బాబుకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలి' | jyothula nehru criticise chandra babu on budget profits | Sakshi
Sakshi News home page

'బాబుకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలి'

Mar 1 2016 6:12 PM | Updated on Jul 28 2018 6:51 PM

'బాబుకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలి' - Sakshi

'బాబుకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలి'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తమ పార్టీ ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తెవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఆయన మీడియాతో మట్లాడారు. కేంద్ర రైల్వే, సాధారణ బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం వైఎస్ఆర్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.

అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వం వహిస్తే వైఎస్ఆర్ సీపీ మద్ధతు పలుకుతుందని స్పష్టంచేశారు. ఈ విషయంపై రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వంపై కచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement