తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees crowd at tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

May 14 2016 6:50 AM | Updated on Sep 4 2017 12:06 AM

చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం శనివారం ఆలయానికి వస్తున్న భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 28 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీనివాసుని 74,350 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2.59 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement