క్వారీలో పడి వ్యక్తి దుర్మరణం | death on quary | Sakshi
Sakshi News home page

క్వారీలో పడి వ్యక్తి దుర్మరణం

Oct 22 2016 1:27 AM | Updated on Apr 3 2019 7:53 PM

కొవ్వూరు : క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొవ్వూరు : క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..  దేచర్ల సమీపంలోని చంద్రారెడ్డి క్వారీలో గతంలో మధ్యప్రదేశ్‌లోని బార్గాకు చెందిన రామ్‌కుమార్‌(42) వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఇటీవల క్వారీని మూసివేయడంతో అతను ఇతర పనుల కు వెళ్తున్నాడు. ఈనెల 19న రాత్రి స్నేహితుడు ప్రహ్లాదతో కలిసి అతను మద్యం తాగాడు. ఆ తర్వాత వారిద్దరూ క్వారీలోకి వచ్చి భవనం వద్ద నిద్రించారు. మరుసటి రోజు ఉదయం వెళ్లిపోయారు. దీనిని క్వారీ ప్రస్తుత వాచ్‌మన్‌ రాయుడు గమనించినా ఇక్కడ పనిచేసినవాడే కదా అని ఊరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ప్రహ్లాద వచ్చి  రామ్‌కుమార్‌ కనిపించడం లేదని, క్వారీ గోతిలో పడ్డాడేమోనని  చెప్పాడు. దీంతో ప్రహ్లాదతోపాటు వాచ్‌మన్‌ లోపలికి వెళ్లిచూడగా, గోతిలో రామ్‌కుమార్‌ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement