మృతుల కుటుంబాలకు సీఎం పరామర్శ | CM visited the families of the dead | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు సీఎం పరామర్శ

Apr 11 2016 3:22 PM | Updated on Aug 30 2018 4:07 PM

విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన బాధితుల కుటుంబాలను సీఎం చంద్రబాబు సోమవారం పరామర్శించారు.

విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన బాధితుల కుటుంబాలను సీఎం చంద్రబాబు సోమవారం పరామర్శించారు. ఆదివారం బైక్‌ను కారు ఢీకొనగా, అదే కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

 

వీరంతా విశాఖ నగరం పరిధిలోని బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన వారు. సోమవారం బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు మృతి చెందిన వారికి రూ.2 లక్షల చొప్పున వారి కటుంబ సభ్యులకు చెక్కులను అందించారు. సీఎం వెంట మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేగన్నబాబు, కలెక్టర్ ఆరోగ్యరాజ్ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement