nakkapalli accident
-
డ్రైవర్ నిద్రమత్తు.. ఏపీలో మరో బస్సు బోల్తా
సాక్షి, అనకాపల్లి జిల్లా: నక్కపల్లి జాతీయపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒడిశా నుంచి సుమారు 38 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తృటిలో భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తిరుపతి జిల్లాలో ప్రైవేట్ బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఘటన జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగింది. వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు లారీని తప్పించబోయి అవతలి వైపు రోడ్డు దూసుకెళ్లి డివైడర్ను ఢీకొట్టింది. -
మృతుల కుటుంబాలకు సీఎం పరామర్శ
విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన బాధితుల కుటుంబాలను సీఎం చంద్రబాబు సోమవారం పరామర్శించారు. ఆదివారం బైక్ను కారు ఢీకొనగా, అదే కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరంతా విశాఖ నగరం పరిధిలోని బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన వారు. సోమవారం బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు మృతి చెందిన వారికి రూ.2 లక్షల చొప్పున వారి కటుంబ సభ్యులకు చెక్కులను అందించారు. సీఎం వెంట మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేగన్నబాబు, కలెక్టర్ ఆరోగ్యరాజ్ తదితరులు ఉన్నారు.


