అయ్యప్పల బస్సు బోల్తా.. | Ayyappa devotees bus overturned near tangutur, 7 severely injured | Sakshi
Sakshi News home page

అయ్యప్పల బస్సు బోల్తా..

Nov 30 2016 8:14 AM | Updated on Sep 4 2017 9:32 PM

అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు బుధవారం తెల్లవారుజామున బోల్తా కొట్టింది.

ఒంగోలు: అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు బుధవారం తెల్లవారుజామున బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అయ్యప్పలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు నుంచి శబరిమల వెళ్తున్న ట్రావెల్స్ బస్సు టంగుటూరు మండలం నాయుడుపాలెం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న ఏడుగురు అయ్యప్పలు గాయలపాలయ్యారు.
 
స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో ఇద్దరు అయ్యప్పల పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement