ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం | Seven People Killed In Kurnool Road Accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం

Jun 24 2018 7:09 AM | Updated on Aug 30 2018 4:17 PM

Seven People Killed In Kurnool Road Accident - Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. వివరాలివి.. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో ఆటో నుజ్జునుజయింది. ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, 108కు కాల్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. మృతదేహాలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరు మండలం కల్లపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరు ఆటోలో మహానందికి వెళ్తున్నారని సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement