వివాహిత ప్రాణం తీసిన టిక్‌టాక్‌ మోజు | Husband Who Murdered His Wife In Tamil Nadu | Sakshi
Sakshi News home page

వివాహిత ప్రాణం తీసిన టిక్‌టాక్‌ మోజు

Feb 19 2020 9:10 AM | Updated on Feb 19 2020 10:40 AM

Husband Who Murdered His Wife In Tamil Nadu - Sakshi

రాజేశ్వరి టిక్‌టాక్‌ వీడియో దృశ్యాలు 

సాక్షి, చెన్నై : టిక్‌టాక్‌ వ్యామోహంతో దారితప్పిన భార్యను భర్త హత్య చేసిన ఘటన బన్రూట్టిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియూర్‌కు చెందిన కుమరవేల్‌ (26), నైవేలి దిడీర్‌కుప్పానికి చెందిన రాజేశ్వరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగు నెలలుగా బన్రూట్టి అన్వర్‌షానగర్‌ నాలుగో వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాజేశ్వరి తన ఇంట్లో హత్యకు గురైంది. దీని గురించి రాజేశ్వరి తల్లి సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు బన్రూట్టి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

భర్తే ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. బన్రూట్టి బస్టాండ్‌ వద్ద కుమరవేలును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వాంగ్మూలంలో రాజేశ్వరి అదే ప్రాంతానికి చెందిన మెకానిక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. టిక్‌టాక్‌లో పలువురి యువకులతో పాటలు పాడుతూ, డాన్సులు చేసి పోస్టులు పెట్టినట్లు తెలిపాడు. ఆమెను మందలించినా పట్టించుకోలేదని..ఆగ్రహంతో ఇనుపరాడ్‌తో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

చదవండి: చెన్నైలో భిక్షమెత్తుకుంటున్న స్వీడన్‌ మహిళా పారిశ్రామికవేత్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement