తల్లీకూతుళ్ల గొడవ.. చివరికి.. | Fight Over Bangles Between Mother Daughter Leads To Death | Sakshi
Sakshi News home page

కూతురితో గొడవ.. తల్లి ఆత్మహత్య!

Feb 17 2020 8:36 AM | Updated on Feb 17 2020 9:30 AM

Fight Over Bangles Between Mother Daughter Leads To Death - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై: తల్లీకూతుళ్ల మధ్య తలెత్తిన వివాదం చివరికి విషాదంగా ముగిసింది. తల్లి మాటలకు మనస్తాపం చెందిన కూతురు ఫినాయిల్‌ తాగగా.. కూతురితో గొడవ కారణంగా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని ఒశివారాలో చోటుచేసుకుంది. వివరాలు...  శశి కోమల్‌ సాగర్‌(52) అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి లోఖండ్‌వాలా మార్కెట్‌ ఏరియాలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం గాజుల విషయమై తన కూతురు ప్రియతో గొడవకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి.. ప్రియ ఫినాయిల్‌ తాగింది. (కూతురు క్యారెక్టర్‌ను అనుమానించి..)

ఈ విషయాన్ని గమనించిన ఇతర కుటుంబ సభ్యులు  ప్రియను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇంటికి తిరిగి రాగా.. శశి ఎక్కడా కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెదికారు. ఈ క్రమంలో వారు నివాసం ఉంటున్న అపార్టుమెంటు రెండో అంతస్తులో శశి విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ ఆధారంగా శశి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని... త్వరలోనే కేసును పరిష్కరిస్తామని పేర్కొన్నారు. (పోలీసులే అత్యాచారం.. ఆపై చేతిలో రూ.600 ఉంచి..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement