కారు బోల్తా.. ఇద్దరు మృతి | Two killed in Car accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. ఇద్దరు మృతి

Nov 15 2015 6:21 PM | Updated on Aug 14 2018 3:22 PM

అనంతపురం జిల్లా డి.హీరేళాల్ మండలం ఓబులాపురం రైల్వేగేటు వద్ద ఓ కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

అనంతపురం జిల్లా డి.హీరేళాల్ మండలం ఓబులాపురం రైల్వేగేటు వద్ద ఓ కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో జరిగిన వివాహానికి హాజరై బెంగళూరుకు కారులో తిరిగి వెళుతుండగా... ఓబులాపురం రైల్వే గేటు వద్ద మలుపులో కారు బోల్తా పడింది. అందులో నలుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement