ముంపు ప్రాంతాలపై చర్యలు చేపట్టండి | Take Action On Mop Up Areas Said Vellampally Srinivas | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాలపై చర్యలు చేపట్టండి

Jun 27 2019 3:38 PM | Updated on Jun 27 2019 3:41 PM

Take Action On Mop Up Areas Said Vellampally Srinivas - Sakshi

సాక్షి,విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలైన రోటరీనగర్‌, భవానీపురం, కెపిహెచ్‌బి కాలనీలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ గురువారం పరిశీలించారు. చిన్నపాటి వర్షానికే ఇక్కడి కాలనీలు నీట మునుగుతున్నాయని అక్కడి స్థానికులు మంత్రి వెల్లంపల్లికి వివరించారు. వెంటనే ముంపు ప్రాంతాలలో చర్యలు చేపట్టి  సమస్యలను పరిష్కరించాలని మంత్రి వెల్లంపల్లి అధికారులను ఆదేశించారు. తర్వాత భవానీపురం దర్గా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌ శానిటేషన్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement