‘కాంగ్రెస్‌తో పొత్తు వల్లే ఓడిపోయాం’  | Payyavula Keshav:TDP Lost Alliance With The Congress | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌తో పొత్తు వల్లే ఓడిపోయాం’ 

Oct 3 2019 12:01 PM | Updated on Oct 3 2019 12:01 PM

Payyavula Keshav:TDP Lost Alliance With The Congress - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కేఈ కృష్ణమూర్తి, చిత్రంలో కాలవ, పయ్యావుల తదితరులు  

సాక్షి కృష్ణగిరి(కర్నూలు) : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. మండల పరిధిలోని కంబాలపాడు గ్రామంలో బుధవారం మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు,  మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, నాయకులు  తిక్కారెడ్డి, మీనాక్షినాయుడు, కేఈ ప్రతాప్, కేఈ జయన్న, కేఈ శ్యాంబాబు, మల్లెల రాజశేఖర్, మల్లికార్జునరెడ్డి, నాగేశ్వరయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement