వర్షపు నీటిలో ఏపీ సచివాలయం | heavy rain in guntur, ​krishna district | Sakshi
Sakshi News home page

వర్షపు నీటిలో ఏపీ సచివాలయం

Jun 6 2017 4:26 PM | Updated on Aug 24 2018 2:36 PM

వర్షపు నీటిలో ఏపీ సచివాలయం - Sakshi

వర్షపు నీటిలో ఏపీ సచివాలయం

గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.

అమరావతి: గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. సచివాలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. వర్షం కారణంగా సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది.
 
అసెంబ్లీ, సచివాలయంలోని పలు ఛాంబర్లు వర్షపు నీటితో నిండాయి. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కార్యాలయంలోకి వర్షపు నీరు సన్నటి ధారగా నీరు పడుతోంది. దీంతో బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. కాగా అసెంబ్లీలోకి మీడియాను అనుమతించలేదు. విజువల్స్‌ తీయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. 
 
 
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement