తుఫాన్ వల్ల 3.5 లక్షల హెక్టార్ల వరిపంట నష్టం | Farmers loss 3.5 Hectares paddy due to helen cyclone | Sakshi
Sakshi News home page

తుఫాన్ వల్ల 3.5 లక్షల హెక్టార్ల వరిపంట నష్టం

Nov 23 2013 5:41 PM | Updated on Sep 2 2017 12:54 AM

తుఫాన్ వల్ల 3.5 లక్షల హెక్టార్ల వరిపంట నష్టం

తుఫాన్ వల్ల 3.5 లక్షల హెక్టార్ల వరిపంట నష్టం

హెలెన్ తుఫాన్ వల్ల రైతులకు అపారం నష్టం వాటిల్లింది.

హెలెన్ తుఫాన్ వల్ల రైతులకు అపారం నష్టం వాటిల్లింది. కోస్తా తీర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడున్నర లక్షల హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని విపత్తు నివారణ శాఖ కమిషనర్ పార్థసారథి చెప్పారు.

అకాల వర్షాల వల్ల ఐదు జిల్లాల రైతులకు ఎక్కువగా నష్టం జరిగిందని తెలిపారు. చేతికొచ్చిన పంట నీటిలో మునిగిపోయిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మరణించినట్టు వెల్లడించాడు. విద్యుత్ పునరద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటామని, సాయంత్రం నుంచి పునరావాస శిబిరాలను మూసివేస్తున్నట్టు పార్థసారథి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement