నేడు తేలనున్న ధర్మాన, సబిత భవితవ్యం | Court to decide on Sabitha Indra reddy, Dharmana Prasadarao custody | Sakshi
Sakshi News home page

నేడు తేలనున్న ధర్మాన, సబిత భవితవ్యం

Aug 7 2013 8:39 AM | Updated on Sep 1 2017 9:42 PM

మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌ల భవితవ్యం నేడు తేలనుంది.

హైదరాబాద్ : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌ల భవితవ్యం నేడు తేలనుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించాలన్న సీబీఐ మెమోపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును బుధవారం వెలువరించనుంది. సబితా , ధర్మాన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది.  వీరిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వ్యక్తిగత పూచికత్తులు సమర్పించినా ..జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపవచ్చంటూ సీబీఐ వాదించింది.

అయితే సీబీఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన ,సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసిందని.. కోర్టుకు  వ్యక్తిగత పూచికత్తును కూడా సమర్పించారని .. అప్పుడు జ్యుడీషియల్‌ రిమాండ్‌ అడగని సీబీఐ ఇప్పుడు ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తుందని  ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 7కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement