కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్య | Couple commit Suicide | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్య

Jul 12 2015 10:32 AM | Updated on Jul 10 2019 7:55 PM

కుటుంబకలహాలతో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

పొన్నూరు (గుంటూరు జిల్లా) : కుటుంబకలహాలతో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. నండూరు గ్రామానికి చెందిన షేక్ హబీబుల్లా, షర్మిల దంపతుల కుటుంబంలో గత కొంతకాలంగా కలతలు చెలరేగాయి. ఈ నేఫథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరికి నాలుగవ తరగతి చదివే కుమారుడు, రెండవ తరగతి చదివే కుమార్తె ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement