అగ్రిగోల్డ్‌ ఆస్తులు.. అధికారపార్టీ నేతలే కాజేశారు | AgriGold Victims Held Meeting At YSRCP Office In Vijayawada | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ ఆస్తులు.. అధికారపార్టీ నేతలే కాజేశారు

Apr 3 2019 4:16 PM | Updated on Apr 3 2019 4:16 PM

AgriGold Victims Held Meeting At YSRCP Office In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధిత ఉద్యమ సంఘాలు బుధవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా బాధితుల సమస్యలపై చర్చ జరిగింది. అగ్రిగోల్డ్‌ బాధితులు అందరూ కలిసి జేఏసీని ఏర్పాటు చేశారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను అధికార టీడీపీ నేతలే కాజేశారని ఉద్యమ నేతలు మండిపడ్డారు.చంద్రబాబు వల్ల తమనకు ఎటువంటి న్యాయం జరగదని బాధితులు అభిప్రాయపడ్డారు.

వైఎస్‌ జగన్‌ బాధితులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీ పట్ల ఉద్యమ  నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు చెల్లింపులు మొదలు పెడతామన్న హామీపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించుకుంటామని జేఏసీ తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నేతలు పర్యటించి వైఎస్సార్‌సీపీకి అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాల మద్ధతు కూడ గట్టాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement