కెప్టెన్‌గా ఫిక్స్‌!.. హింట్ ఇచ్చిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ | NZ Captain-Santner-Hints-Rohit-MI-Captain-Again-During Shake-Hands Viral | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా ఫిక్స్‌!.. హింట్ ఇచ్చిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌

Nov 10 2026 4:23 PM | Updated on Nov 10 2026 4:47 PM

NZ Captain-Santner-Hints-Rohit-MI-Captain-Again-During Shake-Hands Viral

Photo Credit: Twitter

ఐపీఎల్ 2027 సీజ‌న్‌కు సంబంధించి ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ తిరిగి ఎంపిక‌వ్వ‌నున్నాడంటూ కొంత‌కాలంగా రూమ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌లో వేరే జ‌ట్టుకు వెళ్ల‌నుండ‌డంతో ముంబై కెప్టెన్సీ స్లాట్ ఖాళీ కానుంది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియ‌న్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌కే మ‌రోసారి ప‌గ్గాలు అప్ప‌జెప్పాల‌ని ముంబై ఇండియన్స్ ఒక ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఇప్ప‌టివ‌ర‌కు ముంబై కెప్టెన్ ఎవ‌ర‌న్న‌ది జ‌ట్టు యాజ‌మాన్యం అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌న‌ప్ప‌టికీ, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ రోహిత్‌కు కెప్టెన్సీ హింట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం కివీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా వ‌న్డే సిరీస్ ఆడుతోంది. 

ఇవాళ హామిల్ట‌న్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన మూడో వ‌న్డే వ‌ర్ష‌ర్ప‌ణ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే మ్యాచ్ ర‌ద్ద‌యిన‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. దీంతో డగౌట్‌లో ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు సంప్ర‌దాయంగా షేక్ హ్యాండ్స్‌ ఇచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ వ‌ద్ద‌కు రాగానే.. హిట్‌మాన్‌తో చేతులు క‌లిపిన సాంట్న‌ర్‌.. ‘‘హ‌లో కెప్టెన్’’ అని ప‌ల‌కరించాడు. 

దీనికి రోహిత్ బ‌దులుగా ‘‘థ్యాంక్స్ మ్యాన్’’ అని పేర్కొన‌డం ఆస‌క్తి క‌లిగించింది. ఐపీఎల్‌లో మిచెల్ సాంట్న‌ర్ కూడా ముంబై ఇండియ‌న్స్‌కు ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ముంబై ఇండియన్స్ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌న‌ప్ప‌టికీ, సాంట్న‌ర్ మాత్రం ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మేనంటూ హింట్ ఇవ్వ‌డం ఆలోచ‌న‌లో ప‌డేసింది. అయితే కొంతమంది మాత్రం వారిద్దరు మాట్లాడిన మాటలను వాయిస్‌ మార్ఫింగ్‌ చేశారని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇందులో నిజ‌మెంత అనేది ప‌క్క‌న‌బెడితే, సాంట్న‌ర్ హింట్‌తో రోహిత్ అభిమానులు మాత్రం ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నారు. ఎలాగూ 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నుండ‌డంతో, ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెబుతాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నీ కుదిరితే మాత్రం రోహిత్ శ‌ర్మ తన చివ‌రి ఐపీఎల్ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు కెప్టెన్సీ నిర్వ‌హిస్తే చూడాల‌ని ఉంద‌ని అభిమానులు కామెంట్లు చేశారు.

ఇక న్యూజిలాండ్‌తో జ‌ర‌గనున్న వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. తొలి వ‌న్డేలో డకౌట్ అయిన రోహిత్ రెండో వ‌న్డేలో 23 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కివీస్‌తో సిరీస్ ముగిసిన త‌ర్వాత రోహిత్ స్వ‌దేశంలో లంక‌తో వ‌న్డే సిరీస్ ఆడ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జింబాబ్వేతో వ‌న్డే సిరీస్‌కు ముందు రోహిత్ దేశ‌వాళీ టోర్నీ విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ముంబై త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు.

ఇదీ చదవండి: లంకతో తొలి టెస్టు.. పాక్ బ్యాట‌ర్ చెత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement