కమలాపురం : మండల పరిధిలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలో ఉన్న డీఏవీ భారతి విద్యా మందిర్ విద్యార్థి ఎ. సాయిహర్షిత (9వ తరగతి) రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్‌తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల పులివెందులలోని నల్లపురెడ్డిపల్లె జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌లో జరిగిన అండర్–17 బాలికల విభాగం జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్న సాయి హర్షిత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఈ నెల 21వ తేదీ నుంచి గుంటూరు జిల్లా తెనాలిలోని ఎన్టీఆర్ డీఎస్‌ఏ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున తమ విద్యార్థి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. కాగా ప్లాంట్ హెడ్ రామమూర్తి, ఇతర ప్రతినిధులు గౌరీ పరమేశ్వర రావు, భార్గవ్‌రెడ్డి, ప్రాంతీయ అధికారి శేషాద్రి, ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తదితరులు విజేతతో పాటు పీఈటీ చందును అభినందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సైతం మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని సూచించారు.


