తొండూరు: అగడూరు నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు వీరారెడ్డి, సంతకొవ్వూరు సర్పంచ్ అభ్యర్థి భర్త గంగిరెడ్డి, తొండూరు జనార్థన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, రామకృష్ణారెడ్దిలతోపాటు మరికొందరిని రూరల్ సీఐ శాంతిలాల్ అరెస్టు చేశారు. వారిని సింహాద్రిపురం, లింగాల మీదుగా తొండూరు పోలీస్ స్టేషన్‌కు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురువారం సాయంత్రం లింగాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అరెస్టయిన నేతలను పరామర్శించారు. నామినేషన్ కేంద్రం వద్ద అరాచకాలకు పాల్పడిన టీడీపీ వర్గీయులను వదిలేసి, వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టయిన నేతలను పరామర్శించిన ఎంపీ


