టీడీపీ నుంచి 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

అట్లూరు : మండల పరిధిలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరాయి. పోరుమామిళ్లలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో సిగే నాగమునెయ్య, మార్లయ్య, చంద్ర, బ్రహ్మయ్య, బాలకేసి, చెన్నకేసి, బాల వెంకటయ్య, జవాది రవి, అయ్యవారయ్య, గంప వెంకటసుబ్బయ్య, మాదాపూర్‌ రవి, పెద్ద వెంకటసుబ్బయ్య, జవాది చిన్న, గంప రమణయ్య, రమేష్‌, రత్నమయ్య తదితర 20 కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్‌, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూటమి నాయకులు చేసిన అరాచకాలకు విసుగెత్తి టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి రెడ్డిపల్లె గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయన పలుమార్లు ఈ గ్రామాన్ని సందర్శించారని గుర్తుచేశారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సామాజిక వర్గానికి సముచిత అవకాశం కల్పించిందని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో కొందరు అధికారుల సహకారంతో కూటమి నాయకులు ప్రలోభాలకు గురిచేయడం, ఒత్తిళ్లు తీసుకురావడం ద్వాదా ఎన్నికల ప్రక్రియను ప్రభావం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న సర్పంచ్‌ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని పోలీసులు హామీ ఇచ్చారన్నారు. గ్రామాల ప్రజలు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యరుథలు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రొండ మనోహర్‌రెడ్డి, అటవీ శాఖ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ రొండ మల్లికార్జునరెడ్డి, రెడ్డిపల్లె మాజీ సర్పంచ్‌ లక్ష్మీనరసారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు లక్ష్మిరెడ్డి, పెంచల్‌రెడ్డి, వెంకటేష్‌, రమణ యాదవ్‌, శ్రీనివాసులు, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement