రామాలయ ప్రధాన అర్చకుడి కుటుంబంపై దాడి | - | Sakshi
Sakshi News home page

రామాలయ ప్రధాన అర్చకుడి కుటుంబంపై దాడి

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

కడప సిటీ : కడపలోని వెంకటాద్రి అపార్టుమెంట్స్‌లో నివాసం ఉంటున్న హౌసింగ్‌బోర్డు రామాలయ ప్రధాన అర్చకుడి కుటుంబ సభ్యులపై పక్క ఫ్లాట్‌ దంపతులు లక్ష్మీనారాయణరెడ్డి, శైలజ దాడికి పాల్పడ్డారు. ప్రధాన అర్చకుల ఇంట్లోకి దూరి బూతులు తిడుతూ లక్ష్మినారాయణరెడ్డి వీరంగం సృష్టించారు. మొదట ఇంటిలోని ఆడవారిపై చేయి చేసుకుని గాయపరిచిన నిందితుడు మహిళలపై దాడిని అడ్డుకోబోయిన పూజారి(పెద్దాయన స్వామీజీ)ని కిందపడేసి కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డాడు. దాడిలో స్వామీజీ ఎడమకాలు విరిగింది. గత కొద్ది రోజులుగా లక్ష్మినారాయణరెడ్డి తీరు అభ్యంతకరంగా ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన స్వామీజీని మొదట కడప రిమ్స్‌కు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిమబిందు హాస్పిటల్‌కు తరలించారు. స్కానింగ్‌ రిపోర్టుల్లో స్వామివారి కాలు విరిగినట్లు నిర్ధారించిన వైద్యులు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.నిందితుడు లక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడప వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

పరామర్శ : హౌసింగ్‌బోర్డు రామాలయ ప్రధాన అర్చకుడి కుటుంబంపై జరిగిన దాడిని జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు కేహెచ్‌ విజయ్‌భట్టర్‌ ఖండించారు. ఈ మేరకు బాధితుడిని ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement