కడప సెవెన్రోడ్స్ : ఒక మహిళ చదువుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భానుప్రకాశ్ తెలిపారు. 59 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు వారోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం నిర్వహించారు. తొలుత అతిథులు సావిత్రిభాయిపూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా చైర్మన్ దాసరి భానుప్రకాశ్ మాట్లాడుతూ మహిళా విద్యకుగల ప్రాధాన్యతను తెలియజేశారు. వైవీయూ ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు ప్రొఫెసర్ అనిత మాట్లాడుతూ ఆర్థికంగా మహిళా సాధికారత అంటే మహిళలకు తమ జీవితాలను తామే నిర్దేశించుకునే స్వేచ్చ, సమాన హక్కులు, నిర్ణయాలు తీసుకునే శక్తిని కల్పించడం. .సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం ప్రధాన ఉద్దేశమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్మిత మాట్లాడుతూ దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు ఆన్ని రంగాలలో రాణిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.మహిళా సాధికారత, మహిళలఫై అఘాయిత్యాలపై వక్త పీవీ సునీత మాట్లాడుతూ సైబర్ నేరాలు, గృహహింస చట్టాలు, బాలికా సంరక్షణఫై అవగాహన కల్పించారు మహిళా సాధికారత సెల్ కన్వినర్ డాక్టర్ జయంతి జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి అమీరుద్దీన్ పాల్గొన్నారు.


