ఎన్నికల విధులా..! ఆడిట్‌ నిర్వహణా ? | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులా..! ఆడిట్‌ నిర్వహణా ?

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

● ఈ నెల 20 నుంచి 23 వరకు ఆడిట్‌ చేయించుకోవాలంటూ ఆదేశాలు

● ఇప్పటికే ఎన్నికల నిర్వహణ విధుల్లో తలమునకలైన ప్రధానోపాధ్యాయులు

సాక్షి ప్రతినిధి, కడప: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో ఇప్పటికే తలమునకలై ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించి జమ ఖర్చులపై ఆడిట్‌ చేయించుకోవాలంటూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల శిక్షణ జరుగుతున్న తేదీల్లోనే ఆడిట్‌ షెడ్యూల్‌ ఇవ్వడం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇటు ఎన్నికల విధులు నిర్వహించాలా.. లేక ఆడిట్‌ కు హాజరవ్వాలా అన్న సంశయంలో పడ్డారు.

కేటాయించిన తేదీల్లోనే ఆడిట్‌ నిర్వహణ..

జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లోని 1785 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారికి కేటాయించిన తేదీల్లోనే ఆడిట్‌కు హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కడప డివిజన్‌ పరిధిలో 10 మండలాలకు చెందిన 624 మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 21న కడపలో నిర్వహించే ఆడిట్‌కు హాజరు కావాల్సి ఉంది. ప్రొద్దుటూరు డివిజన్‌ పరిధిలోని 11 మండలాలకు చెందిన 564 మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 21న ప్రొద్దుటూరులో నిర్వహించే ఆడిట్‌కు హాజరు కావలసి ఉంది. అలాగే పులివెందుల డివిజన్‌ పరిధి లోని 7 మండలాలకు చెందిన 266 మంది ప్రధానోపాధ్యాయులు ఈనెల 23న పులివెందులలో, అదేరోజు బద్వేల్‌ డివిజన్‌ పరిధిలో 8 మండలాలకు చెందిన 331 మంది ప్రధానోపాధ్యాయులు బద్వేల్‌ లో నిర్వహించే ఆడిట్‌ కు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. వీరందరూ అన్ని రకాల రికార్డులతో హాజరై ఆడిట్‌ చేయించుకోవాలని విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా వీటి నిర్వహణ నిమిత్తం దాదాపు అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు. నామినేషన్‌ ప్రక్రియ మొదలు పోలింగ్‌ ముగించి, గెలిచిన అభ్యర్థులను ప్రకటించేవరకు వీరు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నే ఎన్నికల విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులందరినీ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ ఈనెల 20న జరిగే శిక్షణకు హాజరవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కాకుండా ఈనెల 21న ప్రతి మండలంలోని 50 శాతం మంది ప్రధానోపాధ్యాయులకు క్లస్టర్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు జరుగనున్నాయి. ప్రిసైడింగ్‌ అధికారులుగా తొలి విడత ఎన్నికల విధులకు హాజరు కాబోయే ప్రధానోపాధ్యాయులకు ఈనెల 23న రెండోరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20, 21, 23 తేదీల్లో నిర్వహించే ఆడిట్‌ కు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలంటూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయటం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సామాజిక ఆడిట్‌ షెడ్యూల్‌ను వాయిదా వేయాలని బుధవారం కడపలోని యూటీఎఫ్‌ భవన్లో నిర్వహించిన సమా వేశంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సమావేశంలో డిమాండ్‌ చేసింది.

ఇది చేయాలా... అటు వెళ్లాలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement