● అధినేతతో ఆత్మీయభేటీ
వైఎస్సార్‌సీపీ అఽధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇస్మాయిల్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలో కడప 46వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన జమీల్, బద్వేలు మున్సిపల్ మాజీ చైర్మన్ వాకమళ్ల
రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
–సాక్షి నెట్‌వర్క్
నందలూరు : ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డిల ద్వారా రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నందలూరు మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ భూమన శంకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నందలూరు రైల్వే కేంద్రంలో కార్మిక సంఘాల నేతలను కలిసి, నాగిరెడ్డిపల్లె పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి భోగాపతి శిరీషను గెలిపించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ కోవిడ్ ముందునాటి రైళ్ల హాల్టింగ్‌ల పునరుద్ధరణకు ఎంపీలు కృషి చేస్తున్నారని, మేడా రఘునాథరెడ్డి చొరవతోనే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ లభించిందన్నారు. అలాగే నాగిరెడ్డిపల్లె వద్ద ఆర్వోబీ, హైవే సర్వీసు రోడ్డు నిర్మాణంతో పాటు సౌమ్యనాథ ఆలయం, బౌద్ధారామాలు, తాళ్లపాకకు కనెక్టివిటీ కల్పించాలని ఎంపీలకు వివరిం చామన్నారు.కార్మికులు, పెన్షనర్ల నుంచి తమకు సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆకేపాటి జగదీశ్వరరెడ్డి,తుమ్మల శ్రీధర్‌గౌడ్, మైనార్టీ నేత కలీం, రైల్వేభాస్కర్, నాగిరెడ్డిపల్లె గ్రామపెద్దలు, పాల్గొన్నారు.
కార్మిక నేతల మద్దతు కోరిన మేడా, భూమన


