మహిళల ఆత్మగౌరవంపై దాడిని సహించం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆత్మగౌరవంపై దాడిని సహించం

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

● నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

● వైఎస్సార్‌సీపీ కడప మహిళా విభాగం నాయకుల హెచ్చరిక

కడప అర్బన్‌ : సోషల్‌ మీడియా వేదికగా (ఎక్స్‌) మహిళలను, ముఖ్యంగా రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర, అవమానకర పదజాలంతో మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు టి.పి. వెంకటసుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తిరెడ్డి మండిపడ్డారు. వైరల్‌ అవుతున్న ఆడియో సంభాషణలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం వారు కడప వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సీఐ తిమ్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ.. గతంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై చర్చ జరిగినప్పుడు, ఎవరి వ్యక్తిగత విషయాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ సూచనల మేరకు తమ పార్టీ శ్రేణులు ఎంతో సంయమనం పాటించాయన్నారు. అయితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిలతో పాటు సినీ నటుడు అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి గురించి నీచంగా మాట్లాడటం దారుణమన్నారు.

తన హుందాతనం, సేవా కార్యక్రమాలతో వైఎస్‌ భారతి ప్రజల్లో ప్రత్యేక గౌరవం సంపాదించుకున్నారని, విజయమ్మకు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని వెంకటసుబ్బమ్మ పేర్కొన్నారు. అటువంటి వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ మౌనంగా ఉండటం విచారకరమన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించి నిందితులపై చర్యలకు ఆదేశించాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకెళతాం

నగర అధ్యక్షురాలు బండి దీప్తిరెడ్డి మాట్లాడుతూ.. మహిళల వస్త్రధారణ, వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఇటీవల కడప కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో మహిళా నాయకులు ఎదుర్కొన్న వేధింపులపైనా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియా గ్రూపులు, ఖాతాల వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి కఠిన శిక్షలు వేయాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ తక్షణమే చొరవ చూపాలని, లేనిపక్షంలో ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మహిళలకు రాజకీయాలకు అతీతంగా గౌరవం దక్కాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement