ప్రతిఘటించైనా ఓటుహక్కు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిఘటించైనా ఓటుహక్కు వినియోగించుకోవాలి

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

కడప సెవెన్‌రోడ్స్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి నేతలు అడ్డుకుంటే వారిని ప్రతిఘటించైనా ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఓటుహక్కును వినియోగించుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం మనగలుగుతుందన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలు–కూటమి ప్రభుత్వ అక్రమాలు’అనే అంశంపై శనివారం కడప నగరంలో వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు, రిటర్నింగ్‌ అధికారులు అందరూ కుమ్మకై ్క ప్రతిపక్షాలను, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అలాగే మహిళలను కూడా కొట్టడం, ఈడ్చడం వంటివి చేశారన్నారు. ఈ దురాగతాలను ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు అవసరమైన ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అందుకోసం ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సాహసాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా అధికారపక్షంలేదా అధికారులు ప్రజలను అడ్డుకుంటే ప్రతిఘటించేందుకు సిద్ధపడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. వేదిక నాయకులు సీఆర్‌వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. సీపీఐ నాయకురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నారా భువనేశ్వరిని కించపరిచారని చంద్రబాబునాయుడు గతంలో అసెంబ్లీ నుంచి ఏడ్చుకుంటూ బయటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు ఆయన పాలనలో మహిళలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వెళ్లగా టీడీపీ గుండాలు అడ్డుకుని అసభ్యకరంగా వ్యవహరించినా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు. జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ నామినేషన్‌ పత్రాలు కూటమి రౌడీలు చించివేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకుడు సత్తార్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలు పోలీసులు, ప్రజల మధ్య జరిగాయన్నారు. అధికార పార్టీ నేతలకు డబ్బులిచ్చి కార్పొరేటర్ల సీట్లు కొనుక్కున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకుడు ఓబులేశు, వైఎస్సార్‌సీపీ నాయకులు పోలుదాసు కృష్ణమూర్తి, బాలస్వామిరెడ్డి, కిశోర్‌కుమార్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాలా జయవర్దన్‌, లోక్‌సత్తా పార్టీ నాయకుడు దేవర శ్రీకృష్ణ, ఆప్‌ నాయకుడు డాక్టర్‌ శ్రీనివాసులు, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంఘ నాయకుడు జేవీ రమణ, కాంగ్రెస్‌ నాయకుడు మహమ్మద్‌ అలీఖాన్‌, బీఎస్పీ నాయకుడు గుర్రప్ప పాల్గొన్నారు.అనంతరంమున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి నాయకుల దౌర్జన్యాలను ఎదుర్కొన్న వైఎస్సార్‌ సీపీ నాయకురాలు దీప, సీపీఐ నాయకురాలు భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, మేరి, సునీతలను ఈ సందర్భంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement