ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

వేంపల్లె : ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని వేంపల్లె ప్రజలు రాష్ట్రానికి చాటి చెప్పారన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో లభించిన విజయ స్ఫూర్తితో రాబోయే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ అదే తెగువ, పట్టుదల ప్రదర్శించి పార్టీ అధినేత వైఎస్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజయాన్ని కానుకగా అందించాలన్నారు. పోలీసుల ఒత్తిళ్లు, ప్రత్యర్థుల ప్రలోభాలు, వివిధ ఇబ్బందులను ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన వేంపల్లె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా వచ్చి దౌర్జన్యాలకు పాల్పడతారనో, ఇబ్బందులకు గురిచేస్తారనో కార్యకర్తలు భయపడకూడదని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలబడాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చోరీకి పాల్పడే వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం వేంపల్లె గ్రామపంచాయతీకి సంబంధించి సర్పంచ్‌, వార్డు మెంబర్ల అభ్యర్థుల ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట శివమ్మ, మాజీ జెడ్పీటీసీలు ఎం.రవికుమార్‌రెడ్డి, షబ్బీర్‌ వలి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మునీర్‌ బాషా, రవిశంకర్‌ గౌడ్‌, కోఆప్షన్‌ మాజీ మెంబర్‌ సాదక్‌ వల్లి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి నిస్సార్‌ బాషా, మండల మాజీ ఉపాధ్యక్షుడు బాబా షరీఫ్‌, మాజీ ఎంపీటీసీ రాజకుమార్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రామచంద్రారెడ్డి, సుధాకర్‌, మణిగోపాల్‌రెడ్డి, మోహన్‌ పవర్‌, భారతి, సల్మా తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీటీసీ విజయం స్ఫూర్తితో సర్పంచ్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి సతీష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement